Wednesday, August 23, 2017

Report on Distribution of Note Books and Pen Pencils, etc., & Dental Camp dt 23-8-2017


Report on Distribution of Note Books and Pen Pencils, etc., & Dental Camp dt 23-8-2017
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు, విద్యతో పాటు, సామజిక, ఆధాత్మిక, మననీయ, నైతిక విలువలు ప్రభోదించి, సంపూర్ణ మూర్తి మత్వ వికాసానికి, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, జాతీయ స్థాయిలో గత సంవత్సరము (2016) లో వినూత్న “ విద్యా జ్యోతి పధకాన్ని, అఖిల భారత స్థాయిలో 900 పాఠశాలలలో, రెండు తెలుగు రాష్ట్రాలలో, 222 పాఠశాలలలో, జిల్లాలలో 23 ప్రభుత్వ పాఠశాలల్లో, శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకాన్ని, పిల్లల్లో శారీరక, మానసిక వికాసం కలిగించి, పాఠశాలల్లో అభివృద్ధి చేయడమే విద్య జ్యోతి పధక ప్రధాన వుద్దేశ్యం. జంట నగరాలల్లో 15 పాఠశాలలలో విద్యాజ్యోతి పధకాన్ని అమలు పరచి విశేష సేవలు అందిస్తున్న విషయము విదితమే.

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, బడే చౌడీ లో గల నయా బజార్, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను 15-8-2016 లోనే దత్తత తీసుకొని అనేక సామజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధనతో పాటు 23/8/2017 ప్రైమరీ స్కూల్ బాలబాలికలకు, 70 మందికి, సంవత్సరమునకు సరిపడే నోట్ బుక్స్, pens and pencil  boxes, eraser, sharpner  లను పంపిణి గావించి, అందరికి, డాక్టర్ సునీల్ కుమార్ కొతావర్   PRESIDENT, AIAD SOCIETY, AREA DENTAL CHARITABLE HOSPITAL వారి బృందం, డాక్టర్ జాహ్నవి ప్రియా, డాక్టర్ జయశ్రీ నాయక్, డాక్టర్ తృష , డాక్టర్ హరిత, ఇందిర సహాయకురాలు, వారి ఆధ్వర్యములో దంత వైద్య శిబిరమును ఏంతో సమర్ధవంతముగా నిర్వహించుచు, వచ్చిన వారి తల్లితండులకు కూడా సూచనలు కూడా ఇచ్చి, లోపలున్న 28 బాలబాలికలను గుర్తించి, వారికీ, వర్క్ షాప్, మరియు ఒక డెమో ను కూడా ఇచ్చి పళ్ళు తోముకోను విధానమును, తెలియజేసి, అవసరమైన వారికీ కోల్గేట్ బ్రష్, పేస్టు లను అందజేసి, లోపలున్న 28 మందికి వారి చారిటబుల్ హాస్పిటల్ లో ఫిల్లింగ్ ట్రీట్మెంట్ కూడా చేసేదమని డాక్టర్ జన్నవి తెలియ జేశారు.

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి పక్షాన, బాలవికాస ఇంచార్జి, శ్రీమతి సీతామహాలక్ష్మీ, డాక్టర్స్ బృందమును జ్ఞ్యపీకలు బహూకరించి ఘనముగా సత్కరించారు..

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, జనరల్ చెక్ అప్ ను, స్వచ్ భరత్ పధకం క్రింద  పాఠశాల సిబ్బంది తో సహా స్కూల్ ప్రాంగణమును పరిశుబ్రత కార్యక్రమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి ( PHOTOS ATTACHED )


PLEASE CLICK THE LINK TO VIEW THE PHOTOS 


No comments:

Post a Comment