Tuesday, December 12, 2017

PRESS CLIPPINGS DT 13-12-2017




Report on Distribution of Blankets dt 12-12-2017 to all the students of Sri Sathya Sai Vidya Jyothi Children adopted by Koti Samithi.



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు, విద్యతో పాటు, సామజిక, ఆధాత్మిక, మననీయ, నైతిక విలువలు ప్రభోదించి, సంపూర్ణ మూర్తి మత్వ వికాసానికి, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, జాతీయ స్థాయిలో గత సంవత్సరము (2016) లో వినూత్న “ విద్యా జ్యోతి పధకాన్ని, అఖిల భారత స్థాయిలో 900 పాఠశాలలలో, రెండు తెలుగు రాష్ట్రాలలో, 222 పాఠశాలలలో, జిల్లాలలో 23 ప్రభుత్వ పాఠశాలల్లో, శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకాన్ని, పిల్లల్లో శారీరక, మానసిక వికాసం కలిగించి, పాఠశాలల్లో అభివృద్ధి చేయడమే విద్య జ్యోతి పధక ప్రధాన వుద్దేశ్యం. జంట నగరాలల్లో 15 పాఠశాలలలో విద్యాజ్యోతి పధకాన్ని అమలు పరచి విశేష సేవలు అందిస్తున్న విషయము విదితమే.


శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, బడే చౌడీ లో గల నయా బజార్, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను 15-8-2016 లోనే దత్తత తీసుకొని అనేక సామజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధనతో పాటు 12-12-2017 న ప్రైమరీ స్కూల్ బాలబాలికలకు, 70 మందికి, చలి కాలమును ధృష్టి లో నుంచుకొని, అందరికి, దుప్పట్లను వితరణ గావించడమైనది. శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి పక్షాన, శ్రీమతి మానస, వీణ, వాణి, జ్యోతి తివారి శ్రీమతి శ్రీ సీతామహాలక్ష్మీ, లక్ష్మి గీత, సేవాదళ్ కో-ఆర్డినేటర్ చల్లమల్ల వెంకట లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, జనరల్ చెక్ అప్ ను, స్వచ్ భరత్ పధకం క్రింద  పాఠశాల సిబ్బంది తో సహా స్కూల్ ప్రాంగణమును పరిశుబ్రత కార్యక్రమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.


సమితి కన్వీనర్ - విశ్వేశ్వర శాస్త్రి P ( PHOTOS ATTACHED )