Friday, September 8, 2017

Report on Teachers Day held on 8-9-2017 held Govt Primary School Naya Bazar, Bade Chowdi. Hyd @ PRESS CLIPPING



Report on Teachers Day held on 8-9-2017

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, విద్య జ్యోతి పధకం క్రింద దత్తత తీసుకొన్న  బడే చౌడీ లో గల నయా బజార్, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో అనేక సామజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధన తరగతులను  నిర్వహిస్తూ 8-9-2017  భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలలో భాగంగా, టీచర్స్ డే ను ఘనంగా శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులు నిర్వహించారు   బాల వికాస్ గురువుల ఇంచార్జి  శ్రీ సీత మహా లక్ష్మి మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ జీవితములో అనేక విషములను ఇటు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరిస్తూ, “ గురుశబ్దానికి అర్ధం అంధకారం నుంచి దూరం చేసేవాడు అని, తెయజేస్తూ,  ఆదర్శ ఉపాధ్యాయునికి, ఆకర్షణీయమైన రూపం, మంచి సంభోధనా ( పలకరింపు) ఆశావాదం, అల్పభాషణం, ఉత్సహం, మానసిక స్వచ్ఛత, దయ, చేతనత్వం, నాయకత్వ సామర్థ్యం, మంచి కంఠం, విలువలకు కట్టుబడి ఉండడం, చక్కటి భావ వ్యక్తీకరణ, స్నేహశీలత, భావోద్రేకాల నిలకడ, బోధనపట్ల అనురక్తి, పఠనాసక్తి, సహకార  లక్షణాలు, వుండాలంటూ తెలియజేస్తూ, అన్ని లక్షణాలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లో వున్నయని తెలియజేస్తూ  వారి బదిలీ సందర్భములో, వారు కూర్చున్న బండిని విద్యార్థులు  స్వహస్తాలతో లాగి వారి భక్తి ప్రవత్తులను చాటుకున్నారని తెలిపారు
బాలవికాస గురువులు  లక్ష్మి గీత గారు విద్యాజ్యోతి విద్యార్థులకు, “ చదువు నేర్పిన గురువులకీదే వందనము అంటూ నేర్పిన గీతాన్ని పిల్లలందురు ఏంతో భక్తి శ్రద్ధలతో  పాడి అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన దివంగత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి   రాధాకృష్ణన్ జన్మ దినాన్ని భారత జాతి యావత్తు ఉపాధ్యాయ దినోత్సవంగా  పాటిస్తూ ఆయనకు ఘనంగా  నివాళులర్పిచారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి పక్షాన, బాలవికాస గురువులు, టీచర్స్ డే సందర్భముగా ఉపాద్యాయులుగా, తరగతులను నిర్వహించిన వారికీ   జ్ఞ్యపీకలు బహూకరించి అభినందించారు.
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, జనరల్ చెక్ అప్ ను, స్వచ్ భరత్ పధకం క్రింద  పాఠశాల సిబ్బంది తో సహా స్కూల్ ప్రాంగణమును పరిశుబ్రత కార్యక్రమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో, శ్రీమతి రేణుక, శ్రీమతి శ్రీ సీత మహాలక్ష్మి, శ్రీమతి హెబీసీబా, లక్ష్మిగీత తదితరులు పాల్గొన్నారు. సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి 
please click the link to see the photos.