Sunday, March 5, 2017
Saturday, March 4, 2017
Vidya Jyothi Program on 4th March 2017 - Carrom Board Presentation
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి పధకం క్రింద శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి కి, బడేచౌడీ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, నయా బజార్ స్కూల్ ను15-8-2016 న దత్తత తీసుకొన్న విషయము విదితమే.. నాటి నుండి నేటి వరకు, స్వతంత్ర దినోత్సవ వేడుకలను, గణ తంత్ర దినోత్సవ వేడుకలను, బాలవికాస్ తరగతులను, సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి ( టీచర్స్ డే సందర్భముగా,
విద్యార్థిని, విద్యార్థులకు, వ్యాస రచన, వాక్రుత్వ పోటీలు, నిర్వహించి, న్యాయ నిర్ణేతలుగా కార్యక్రమమునకు విచ్చేసి, వారి నిర్ణయము ప్రకారము, ప్రధమ, ద్వితీయ, తృతీయ, మరియు కన్సోలేషన్, బహుమతులుగా, వారికీ, రోజు ఉపయోగపడే, స్టీల్ టిఫన్ కారియర్ లను, ( వారికీ సరిపడే చిన్న) ఈవ్వడమైనది. మహాత్మా గాంథి జయంతి సందర్భముగా, ప్రధాన మంత్రి పిలుపు మేరకు, స్వచ్ భారత్ సందర్భముగా, వారికి, గురువులు, వారి ఇంట్లో, పాఠశాల లో, చేయ వలసిన, చేయ కూడని పనులను, అవి వారి వారి ఆరోగ్యమునకు, ఏ రకముగా, మేలు చేయునో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, ఆనాడే చెప్పిన విషయాలన్నీ చెప్పి, వారిలో మంచి అలవాట్లు, పాటలు, గణ తంత్ర దినోత్సవము ను దృష్టి లో ఉంచుకొని, భారతీయ జాతి పతాకం పై ఒక మంచి పాటను, పిల్లకు, విద్య జ్యోతి బాలవికాస్ గురువు, శ్రీమతి లక్ష్మి గీత గారు పాటను నేర్పటం, దానిని పిల్లలు, గురువులు, దానిని, ఈ రోజు, అనగా 26th జనవరి, 2017 న అందరి సమక్షంలో పాడించి, ఇటు పిల్లలను, నేర్పిన గురువులను, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారికీ, స్కూల్ హెడ్ మిస్ట్ర్రేస్, హెబీసీబా, అనేక కృతజ్య్నాతలు తెలియ జేశారు.
ప్రస్తుతము పిల్లలకు, మంచి అలవాట్ల తో పాటు, పాటలు, ఆటలు కూడా ప్రతి శుక్రవారం, 2 గంటల నుండి, 3-30 గంటల వరకు, ప్రత్యేక తరగతి ని తీసుకోని, భోదించడమైనది.
ఈ రోజు, ఒక ప్రతేక్య మైన CARRAM బోర్డు , విద్యారులకు బహుకరించడమైనది. జాతీయస్థాయి CARRAM బోర్డు - ఛాంపియన్ శ్రీ శివానంద రెడ్డి గారు ( పోస్టల్ డిపార్ట్మెంట్ ) వచ్చే శనివారం నుండి, ప్రతి శనివారం విద్యార్థులకు శిక్షణ నివ్వనున్నారు. వచ్చే నెలలో, విద్యార్థులకు డెంటల్ క్యాంపు ను కూడా నిర్వహించనున్నాము.
ఈ నాటి 4-3-2017 – PROGRAM ---
CARRAM బోర్డు బహుకరణ కార్యక్రములో, శ్రీ గీత లక్ష్మి, కుమారి శ్రీ శారదా సుప్రియ, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, హెడ్ మిస్ట్రెస్ హెబీసీబా, తదితరులు పాల్గొని ఆటలో శిక్షణ నిచ్చి, కొన్ని, మెళుకువలు నేర్పి, వారితో ఆడించడమైనది.
ఫోటో జత చేయడమైనది.
కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి
Subscribe to:
Posts (Atom)